Showing posts with label Education. Show all posts
Showing posts with label Education. Show all posts

Monday, December 13, 2021

ఓమి క్రాన్ వైరస్ లక్షణాలు ఏమిటి ఇది కరోనా కంటే భిన్నమైనదా కాదా పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోండి

ఓమిక్రాన్ వైరస్ లక్షణాలు ఏమిటి ఇది కరోనా కంటే భిన్నమైనదా కాదా పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోండి


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన ఈ వైరస్. ప్రజలపై ఏ రకంగా ప్రభావం చూపుతుందనే అంశంపై  ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ చాలా ప్రాణాంతకం కానప్పటికీ,  దాని సంక్రమణ రేటు యొక్క తీవ్రతను తోసిపుచ్చలేమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తులు జలుబు గురించి గందరగోళానికి గురవుతారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.


ఈ కొత్త వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఆ తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. కొత్త వేరియంట్‌ను నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) (డబ్ల్యూ.హెచ్‌.ఓ.) నిర్ధారించింది. నవంబర్ నెల లో దీనికి ఒమిక్రాన్ (OMICRAN) అని పేరు పెట్టారు.

  • వీటిలో అన్ని రకాల మ్యుటేషన్లు ప్రమాదకరం కాదు. అందుకే వైరస్‌లో ఎలాంటి మ్యుటేషన్లు వచ్చాయన్నది చాలా కీలకంగా పరిశీలించాలి అంటున్నారు .

  • ఒక్క విషయం మాత్రం స్పష్టం. చైనాలోని వూహాన్‌లో బయటపడిన ఒరిజినల్ కోవిడ్-19 వైరస్‌కు, ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రాథమికంగా భిన్నంగా ఉంది అని చెప్పవచ్చు .

  • ఒరిజినల్ వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కోవిడ్ వ్యాక్సీన్లు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై పెద్దగా పనిచేయకపోవచ్చని   చాలా మంది అనుకుంటున్నారు 

  • ఇతర వేరియంట్లలోనూ కొన్ని రకాల మ్యుటేషన్లను గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో వాటి పాత్ర ఏంటన్నది శాస్త్రవేత్తలకు అవి కొంత సమాచారం ఇవ్వొచ్చు. ఉదాహరణకు.. N501Y అనే మ్యుటేషన్ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.

  • శరీర రోగ నిరోధక శక్తి.  వైరస్‌ను గుర్తించకుండా చేసే కొన్ని మ్యుటేషన్లు ఉన్నాయి. అలాంటివి వ్యాక్సీన్ సమర్థతపై ప్రభావం చూపుతాయి. మరికొన్ని మ్యుటేషన్లు పూర్తి భిన్నంగా ఉంటాయి.

  • ముందుగా అనుకున్న దానికంటే ఈ వేరియంట్‌లో మ్యుటేషన్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూ.హెచ్‌.ఓ . వెల్లడించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది.

  • ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ మొదట గుర్తించారు. ఈ వేరియంట్ సోకిన వాళ్లకు చాలా తేలికపాటి కోవిడ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆమె బీబీసీ కి చెప్పారు.
ఓమి క్రాన్ వైరస్ లక్షణాలు

ఒమిక్రాన్ లక్షణాల గురించి స్పష్టమైన సూచనలు లేనప్పటికీ, ఈ కొత్త వేరియంట్ సోకిన వ్యక్తులలో అనుభవించిన సమస్యల ఆధారంగా దాని లక్షణాలు కొన్ని డెల్టా వైరస్ నుండి భిన్నంగా కనిపిస్తాయి. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ మొదటి కేసు టాంజానియాకు చెందిన వ్యక్తిలో కనుగొనబడింది. దీని తరువాత ఓమిక్రాన్ సోకిన మరో ఐదుగురు (5) వ్యక్తులను గుర్తించారు.

ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు కనుగొనబడిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు.

  • ఒంటి నొప్పులు, తీవ్రమైన అలసట ఉన్నట్లు చాలా మంది రోగులు చెబుతున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ అన్నారు. అయితే, తాను చెబుతున్నది యువకుల గురించి మాత్రమేనని, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి గురించి కాదని ఆమె వివరించారు.

  • అయితే, ఈ వేరియంట్‌ కలిగించే వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఇంకాస్త సమయం పడుతుందని డాక్టర్ ఏంజెలిక్ చెప్పారు.

  • డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ చాలా వేగంగా ఇతరులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందన డాని కి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)  (డబ్ల్యూ.హెచ్‌.ఓ) ,  చెప్పినప్పటి కీ,  ఇది ఆందోళన కలిగించే విషయమే అని భావించాలి.

  • అనేక మంది రోగులను విశ్లేషించిన తర్వాత ఒమిక్రాన్ రోగులలో సాధారణ జలుబు సమస్య అతి సాధారణం అని కనుగొనబడింది.  అయితే మునుపటి వైరస్‌లోని  ఇతర లక్షణాలు  ఏవీ కనుగొనబడలేదు అని చెప్పారు. 

  • ఒమిక్రాన్  బారిన పడిన వ్యక్తులు జలుబు గురించి గందరగోళానికి గురవుతారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని.. రుచి లేదా వాసన మాత్రమే పోతుందని ఆయన వెల్లడించారు.

  • ఐదవ (5)  రోగిలో గొంతు నొప్పి మరియు శరీర నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఇది కాకుండా, కొంతమంది రోగులలో తలనొప్పి, అలసట,  శరీరం మరియు  వంటి నొప్పులు  వంటి ఫిర్యాదులు  కూడా వచ్చాయి అన్నారు.

పై విషయాలు ఆధారంగా దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఏం చెబుతున్నారంటే. ఓమిక్రాన్ మూడు ప్రధాన లక్షణాలు ఇవి అని చెప్పవచ్చు అవి ఏమిటంటే


💥 తలనొప్పి 


💥 తీవ్రమైన అలసట


💥 ఒళ్లు నొప్పులు 


💥 ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు.


భారత దేశంలో ఒమిక్రాజ్ వేరియంట్


భారత దేశంలో ఒమిక్రాజ్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పిటవరకూ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 32 కేసులు రికార్డయ్యయాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అలెర్ట్ అయ్యాయి. 

  • తెలుగు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే మాస్క్ మస్ట్ అనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైనా మాస్క్ వేసుకోకుండా బయటకు వస్తే రూ.1000 ఫైన్ వేస్తామని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

  • మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దు జిల్లాల అధికార యంత్రాంగాలను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తాజాగా AP కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.100 ఫైన్ వేయనున్నారు. ఇక మాస్క్ లేనివారిని షాపులోకి రానిస్తే.. 10వేల నుంచి 25 వేల వరకూ ఫైన్ విధిస్తామనీ దుకాణా యజమానులకు సూచించింది. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.

  • రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని ప్రభుత్వాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. బయటకు వచ్చేటప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు.

  •  ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులేవీ నిర్థారణ కాకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.

ఒమిక్రాన్ సోకకుండా ఈ జాగ్రత్తలు తప్పక పాటించడం మంచిది.

  • కరోనాను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. 

  • ఏవైనా లక్షణాలను బయటపడితే వెంటనే తనిఖీ చేయించుకుని, ఒంటరిగా ఉండండి. 

  • ఈ విధంగా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. 

  • మాస్క్‌ను సరైన విధానంలో ధరించాలి.

  • సామాజిక దూరం  6 అడుగులు పాటించాలి.

  • ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ పదార్దాలు తిన రాదు

  • ఇప్పటివరకు రెండు డోస్‌ల టీకాలను తీసుకోకపోతే.. వీలైనంత త్వరగా తీసుకోండి.

కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువ అయితే జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ హెచ్చరించడం తెలిసిందే. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు సందేశం పంపింది. ఒమిక్రాన్ బారినపడిన వారిలో అందరిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలపడం శుభసూచికం.

ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్ . ల లో ఓమిక్రాన్ వైరస్ గురించి ఇంకా తెలుసుకోండి :



Todays Quote:

 "Who you spend your time with will have a great impact on what kind of life you live. Spend time with the right people."

- Joel Osteen


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


 

 


Tuesday, August 17, 2021

బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి? ఎవరికి సోకుతుంది? దాని లక్షణాలేమిటీ? ఎలా చెక్ పెట్ట వచ్చు ?

బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి? ఎవరికి సోకుతుంది? దాని లక్షణాలేమిటీ?  ఎలా చెక్ పెట్ట వచ్చు?

ఇప్పుడు భారత దేశం కరోనా వైరస్‌తో  చాల ఇబ్బంది పడుతుంటే ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్ - Mucormycosis) ఒకటి కొత్తగా వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు ఇది ఎక్కువగా సోకుతోంది. కొన్ని గుంపుగా ఉంటూ ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఈ వైరస్ పాతదే అయినా ఇప్పుడు దీని వ్యాప్తి  ఇప్పుడు ఎక్కువైంది. 

బ్లాక్‌ ఫంగస్‌ అంటే ఏమిటి ?

మ్యుకోర్‌ మైకోసిస్‌ అనేది ఓ అరుదైన శిలీంద్రం. తేమతో కూడిన ఉపరితలాలపై ఎక్కువగా కనిపిస్తుంటుంది. నల్లగా బూజు పట్టినట్లు ఉండటం వల్ల దీన్ని బ్లాక్‌ ఫంగస్‌గా వ్యవహరిస్తున్నారు.  

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్   ఈ  బ్లాక్ ఫంగస్ గురించి కొన్ని  సూచనలు చేశారు. ట్విట్టర్ ద్వారా వాటిని అతను  పంచుకున్నారు.


బ్లాక్ ఫంగస్ - భారత ఆరోగ్య కేంద్రం సూచనలు:

  • బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే (వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి) సోకుతుంది.

  • ఇది సోకితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది.

  • మొదట్లోనే దీన్ని గుర్తిస్తే వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు.

 ‘బ్లాక్ ఫంగస్’ ఎవరికి సోకుతుంది? దాని లక్షణాలేమిటీ?

  • డయాబెటీస్ నియంత్రణలో లేని కరోనా బాధితుల్లో ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతున్నట్లు గుర్తించారు.

  • కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో కూడా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతోంది.

  • దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది. అలాగేవొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి, 

  • డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి, 

  • ఇదివరకే అనారోగ్య సమస్యలున్న కరోనా బాధితులకు స్టిరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు.

  • సైనసైటిస్‌ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడవచ్చు.

  • స్టెరాయిడ్లు వాడే వారికి, ICUలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకగలదు.

  • ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి ఏర్పడుతుంది.

  • బ్లాక్ ఫంగస్ వల్ల కళ్లు ఎర్రబడతాయి. 

  • ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి.

  • తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది  కలగవచ్చు. 

  • మానసిక స్థితి అదుపుతప్పడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

  • ముక్కులో దురద, కళ్లపైన లేదా కళ్ల కింద ఉబ్బినట్లు కనిపించినా, కంటిచూపు మందగించినా  వైద్యులను  సంప్రదించాలి.
  • దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి.

  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఈ ఫంగస్ ఏర్పడవచ్చు.

  • కోవిడ్ బాధితులందరికీ ఈ ఫంగస్ ఏర్పడదు. కాబట్టి.. అందోళన వద్దు.


ఈ జాగ్రత్తలతో బయటపడొచ్చు:

  • కోవిడ్ చికిత్స పొందేవారు ఇదివరకు ఏమైనా వ్యాధులలతో బాధపడినా, శస్త్ర చికిత్సలు చేయించుకున్నా వైద్యులకు ముందుగా తెలియజేయాలి. 

  • కోవిడ్ చికిత్స అందించే వైద్యులకు ముందుగా మీ అనారోగ్య సమస్యలను తెలియజేస్తే.. ఫంగస్ ఏర్పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.

  • డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్‌ వాడకుండా జాగ్రత్త పడటం ద్వారా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.

ఆక్సిజన్‌కు తయారీకి వాడే నీరు కూడా కారణమా?

  • కోవిడ్ బాధితులకు ‘హ్యూమిడిఫయర్లు’ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. వీటిలో స్టెరైల్ వాటర్‌ను ఉపయోగించాలి. వాటికి బదులు సాధారణ నీటిని వాడితే ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడే ప్రమాదం ఉందని అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియలజిస్ట్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యూమిడిఫయర్లలో కేవలం స్టెరైల్ నీటిని మాత్రమే వాడాలని తెలిపారు. 

  • కొన్ని హాస్పిటళ్లు, ఐసోలేషన్ కేంద్రాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు సాధారణ నీటిని ఉపయోగిస్తున్నారని, వాటిలో ఉండే సూక్ష్మ జీవులు శరీరంలోకి చేరడం వల్ల ఫంగస్ ఏర్పడుతుందన్నారు. హ్యూమిడిఫయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీటిని మార్చడం ద్వారా ఈ సమస్య నుంచి కాపాడవచ్చని తెలిపారు.
ఇలా చెక్ పెట్టవచ్చు:

  • డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

  • కరోనా నుంచి రికవరీ అయిన డయాబెటిస్ ఉన్న వారు హాస్పిటల్ నుండి  డిశ్చార్జి అయ్యాక షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

  • స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలి.

  • బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

  • కరోనా సోకి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోతే  అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా కావచ్చని అనుకోవాలి.

  • ఈ వ్యాధి  కి వెంటనే  ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా రోగిని బతికించవచ్చు.

  • ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు. 

  • వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు.
ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.ల లో మరింత తెలుసుకోండి :


Note 1:

ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సొంత వైద్యం ఆరోగ్యానికి హానికరం.  సమాచారానికి  పూర్తిగా ఇంటర్నెట్ వెబ్  సైట్ ల నుండి  సేకరించడం  జరిగింది ఈ బ్లాగ్ సమాచారం కేవలం సమాచారం మాత్రమే . శాస్త్రీయ విషయాల లో ఉండే లోటు పాట్లకు  ఈ బ్లాగ్  బాధ్యత వహించదు.

ఈ రోజు సూక్తి :

"I learned that courage was not the absence of fear, but the triumph over it. The brave man is not he who does not feel afraid, but he who conquers that fear."

- Nelson Mandela

Note 2:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com








Tuesday, June 22, 2021

COVID-19 కరోనా వాక్సిన్ వేసుకునే ముందు, వేసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తినాలి ? ఎలాంటి ఆహారం తినకూడదు?

COVID-19  కరోనా వాక్సిన్   వేసుకునే ముందు, వేసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తినాలి ? ఎలాంటి ఆహారం తినకూడదు?

కరోనావైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు? ఇప్పుడు ప్రపంచం లో చాలామందిని వేధిస్తున్న ప్రశ్నఇదే. ఏం తింటే వ్యాక్సిన్ ప్రభావం తగ్గుతుందో, ఏం తింటే వ్యాక్సిన్ ఇంకా ప్రభావవంతంగా పనిచేస్తుందోననే సందేహం చాలామందిలో ఉంటుంది. ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ వ్యాసం.

ఇప్పటికే  ఇండియా లో  కొన్ని కోట్ల  మంది జనాభా COVID-19 వ్యాక్సిన్  తీసుకోగా ఇంకా ఎంతో మంది కరోనా వ్యాక్సిన్ కోసం క్యూలో వేచిచూస్తున్నారు. అయితే, కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వాళ్లంతా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేయడం కోసం ఆహారంగా ఏం తీసుకుంటే బాగుంటుంది? వేటికి దూరంగా ఉంటే బాగుంటుందనేది తెలుసు కోవాల్సిన  అవసరం  ఉంది. 

టీకా కు ముందు తీసుకోవలసిన పదార్దాలు 

నీరు ఎక్కువగా తీసుకోవాలి 

కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువగా నీరు తాగండి. అప్పుడు మీ శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండి నీరసం దనిచేరనివ్వదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశాలను కూడా తగ్గిస్తుంది. అందుకే నీరు తాగడం మర్చిపోవద్దు.

పసుపుః

పసుపులో కర్కుమిన్ అని పిలవబడే షేడెడ్ సమ్మేళనం కలగిన రసాయనం ఉంటుంది. ఇది ఆహారంలో రుచిని తీసుకురావడానికి పనిచేస్తుంది. పసుపు నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి తగ్గించే ఆహారం. అందువల్ల, టీకా వేసుకునే ముందు పసుపు తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పాలలో పసుపు వేసుకొని తాగాలి. ఇది ఒక రకమైన గో-టు-స్ట్రెస్ యాంటీ ఫుడ్. ఇది మెదడును ఒత్తిడి నుండి కాపాడుతుంది.

వెల్లుల్లి:

రోగనిరోధక శక్తిని పెంచడానికి వెల్లుల్లిని ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది ప్రోబయోటిక్స్ నిండి ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్, పల్స్ తగ్గడంపై ఏకీకృత ప్రభావాలు, కణాలకు హాని కలిగించే క్యాన్సర్ నివారణ ఏజెంట్లను కలిగి ఉంటాయి.

అల్లం:

రక్తపోటు, ఊపిరితిత్తుల సంక్రమణను నివారించడానికి అల్లం సహాయపడుతుంది. ఇది కాకుండా ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కనుక టీకా వేసుకునే ముందు అల్లం తీసుకోవాలి. మీరు ఉదయం అల్లం టీ తాగవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి టీకా తీసుకునే ముందు తినాలి.

హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తీసుకోవాలి:

కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెల్దీ బాడీ కోసం హెల్దీ ఫుడ్ (Healthy foods) తప్పనిసరి. అందుకే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకున్నప్పుడు అంతకంటే ముందు ఆ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా హోల్ గ్రెయిన్ ఫుడ్స్ తీసుకోవాలి. ప్రాసెసింగ్ చేసిన వాటిలో కొవ్వు, కెలొరీలు అధికంగా ఉండనుండగా హోల్ గ్రెయిన్ ఫుడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది.

బ్యాలెన్స్‌డ్ డైట్: 

కొవిడ్-19 వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన చాలా మందిలో కలిగిన కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే అవి బలహీనత, కళ్లు తిరగడం వంటి లక్షణాలే. అలా కాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫైబర్ అధికంగా ఉండే పళ్లు, కూరగాయలు (Fruits and vegetables) ఎక్కువగా తీసుకోవడం మంచిది

ఫైబర్ ఫుడ్స్‌కి అధిక ప్రాధాన్యత:

వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం శరీరానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం అవసరం. క్లినికల్ స్లీప్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం కొవ్వు, షుగర్ అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి నిద్రలేమికి కూడా దారితీస్తుంది. అదే కానీ జరిగితే అది మీరు తీసుకునే కొవిడ్-19 వ్యాక్సిన్ పనితీరు కూడా నెమ్మదిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

టీకాకు తరువాత  తీసుకోవలసిన పదార్దాలు:

ఆకుపచ్చ కూరగాయలు:

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో చాలామందిలో అల‌స‌ట‌, నీరసం వంటి ల‌క్షణాలు క‌నిపిస్తున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. కాబ‌ట్టి ఈ దుష్ప్రభావాల నుంచి బ‌య‌ట ప‌డాలంటే శ‌రీరానికి శ‌క్తినిచ్చే, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే స‌మ‌తుల్య ఆహారం తీసుకోవ‌డం మంచిది. ఫైబ‌ర్ అధికంగా ఉండే పండ్లు, కూర‌గాయ‌లు తినాలి. ముఖ్యంగా ఆకుపచ్చ రంగు కూరగాయలను ముఖ్యంగా పోషకాలు, ఖనిజాలు, ఫినోలిక్ సమ్మేళనాలతో కూడి ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఐరన్, కాల్షియం వంటి ఖనిజ పదార్ధాలు ప్రధానమైన ఆహార ధాన్యాల కన్నా పచ్చటి కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి కూరగాయలలో క్యాన్సర్ నివారణ ఏజెంట్లు అధికంగా ఉంటాయి.

తాజా పండ్లు:

ఆకు కూరలతో పాటు పళ్లు అధికంగా తీసుకోవాలి. ముఖ్యమైన పోషకాలు, ఖనిజాలు, మొక్కల సింథటిక్ సమ్మేళనాలు ఉంటాయి. అవి అదనంగా ఫైబర్ కలిగి ఉంటాయి. టీకా తీసుకునే ముందు ఒకరి శరీరానికి శక్తిని అందించే ముఖ్యమైన పదార్థాలలో ఇది ఒకటి.

బ్లూబెర్రీస్:

బ్లూ బెర్రీస్‌లో ఫైటో ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది కాకుండా పొటాషియం, విటమిన్ సి చాలా ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది. టీకాలు వేసిన తరువాత ఖచ్చితంగా దీనిని మీ డైట్‌లో చేర్చుకోండి. కణ ఉపబలాలు, ఫైటో ఫ్లేవినాయిడ్స్‌తో లోడ్ చేయబడిన ఈ బెర్రీలలో అదనంగా పొటాషియం, పోషకాలు అధికంగా ఉంటాయి.

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న కోకో క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని, టీకాలు వేసిన తరువాత ఇది చాలా ముఖ్యమని అధ్యయనాలలో కనుగొనబడింది. కొరోనరీ అనారోగ్యం ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. టీకా అనంతర విషయానికి వస్తే ఇది తప్పనిసరి.

వర్జిన్ ఆలివ్ ఆయిల్:

వర్జిన్ ఆలివ్ ఆయిల్ డయాబెటిస్, న్యూరోలాజికల్ డిసీజ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో సంతృప్త కొవ్వు ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆహారంలో వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది.

చికెన్ / కూరగాయల ఉడకబెట్టిన పులుసు సూప్:

దృఢమైన రోగ నిరోధక ప్రతిచర్యకు చికెన్ గానీ, కూరగాయలతో ఉడకబెట్టిన పులుసును కానీ తీసుకుంటే శరీరానికి కావల్సిన పోషక విలువలు అందుతాయి.

బ్రోకలీ:

న్యూట్రిషన్ రీసెర్చ్ చేసిన ఒక పరీక్షలో ఆవిరి బ్రోకలీని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అమెరికాలో మరొక పరిశోధన అదేవిధంగా తినే నియమావళిలో కూరగాయలను విస్తరించడం, ముఖ్యంగా బ్రోకలీ వంటి క్రూసిఫరస్ కూరగాయలు కొరోనరీ అనారోగ్యం ప్రమాదాన్ని తగ్గిస్తుందని గుర్తించాయి. ఇది ఆహారంతో ఉడికించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

మంచి నిద్ర అవసరం: 

క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, తీసుకున్న త‌ర్వాత‌ విశ్రాంతి చాలా అవ‌స‌రం. ఎంత ఎక్కువ నిద్రపోతే అంత చురుగ్గా ఉంటాం.

టీకా తరువాత తీసుకోకూడని  పదార్దాలు : 

అల్కాహాల్ తీసుకోరాదు: 

అల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అన్నింకిమించి మద్యం అలవాటు అనేది వ్యాధినిరోధక శక్తి నశించేలా చేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అయినా లేదా వ్యాధినిరోధక శక్తిని కోల్పోయినా అది కొవిడ్-19 టీకా పనితీరుపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా జ్వరం, ఒళ్లునొప్పులు, కళ్లు తిరగడం, నీరసం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ( Side effects of COVID-19 vaccine) వచ్చే ప్రమాదం ఉంటుంది.

ధూమపానం:

టీకాను ఖాళీ కడుపు తో తీసుకోవడం మంచిది కాదు. అలాగే ధూమపానం వల్ల ఉపిరితిత్తులకు ఇబ్బంది కలిగించే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.

ఆల్కహాల్‌, కెఫిన్ పానీయాలు:

ఆల్కహాల్ సేవించే వారు టీకా తీసుకోవ‌డానికి కొన్ని వారాల ముందు నుంచి, తీసుకున్న త‌ర్వాత కొన్ని రోజుల వ‌ర‌కు మందు తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఎందుకంటే టీకా తీసుకున్న త‌ర్వాత శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఆల్కహాల్‌ డ్రింక్ చేస్తే శ‌రీరం తొంద‌ర‌గా డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది. దీనివ‌ల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గిపోతుందని ప‌లు అధ్యయ‌నాల్లో వెల్లడైంది. ఇమ్యూనిటీ త‌గ్గిపోతే.. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనే శ‌క్తి త‌గ్గిపోతుంది.

చ‌క్కెర ప‌దార్థాలు :

ఈ స‌మ‌యంలో సంతృప్త కొవ్వులు, చ‌క్కెర‌స్థాయులు ఎక్కువ ఉన్న ఆహారాన్ని దూరం పెట్టాలి. ఎందుకంటే చ‌క్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం ద్వారా ఒత్తిడి, యాంగ్జైటీ పెరిగిపోతుంది. దీంతో నిద్ర స‌రిగ్గా ప‌ట్టక‌ స‌రైన విశ్రాంతి ఉండ‌దు. వీలైనంత వ‌ర‌కు అధిక ఫైబ‌ర్ ఉండే ఆహారమే తీసుకోవాలి.


ఈ క్రింది వీడియో యు.ఆర్.యల్.ల లో  సంబందించిన వీడియోలను  చూడండి:



Todays Quote:

"Happiness is letting go of what you think your life is supposed to look like and enjoying it for everything that it is."

-Mandy Hale


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...