ఓమిక్రాన్ వైరస్ లక్షణాలు ఏమిటి ఇది కరోనా కంటే భిన్నమైనదా కాదా పూర్తి వివరాలు ఏమిటో తెలుసుకోండి
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించిన ఈ వైరస్. ప్రజలపై ఏ రకంగా ప్రభావం చూపుతుందనే అంశంపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి ఒమిక్రాన్ చాలా ప్రాణాంతకం కానప్పటికీ, దాని సంక్రమణ రేటు యొక్క తీవ్రతను తోసిపుచ్చలేమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తులు జలుబు గురించి గందరగోళానికి గురవుతారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.
ఈ కొత్త వేరియంట్ ముందుగా దక్షిణాఫ్రికాలో బయటపడింది. ఆ తర్వాత దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమాచారం అందించారు. కొత్త వేరియంట్‌ను నవంబర్ 24న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) (డబ్ల్యూ.హెచ్.ఓ.) నిర్ధారించింది. నవంబర్ నెల లో దీనికి ఒమిక్రాన్ (OMICRAN) అని పేరు పెట్టారు.
- వీటిలో అన్ని రకాల మ్యుటేషన్లు ప్రమాదకరం కాదు. అందుకే వైరస్‌లో ఎలాంటి మ్యుటేషన్లు వచ్చాయన్నది చాలా కీలకంగా పరిశీలించాలి అంటున్నారు .
- ఒక్క విషయం మాత్రం స్పష్టం. చైనాలోని వూహాన్‌లో బయటపడిన ఒరిజినల్ కోవిడ్-19 వైరస్‌కు, ప్రస్తుతం ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రాథమికంగా భిన్నంగా ఉంది అని చెప్పవచ్చు .
- ఒరిజినల్ వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కోవిడ్ వ్యాక్సీన్లు.. ఒమిక్రాన్ వేరియంట్‌పై పెద్దగా పనిచేయకపోవచ్చని చాలా మంది అనుకుంటున్నారు
- ఇతర వేరియంట్లలోనూ కొన్ని రకాల మ్యుటేషన్లను గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్‌లో వాటి పాత్ర ఏంటన్నది శాస్త్రవేత్తలకు అవి కొంత సమాచారం ఇవ్వొచ్చు. ఉదాహరణకు.. N501Y అనే మ్యుటేషన్ కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.
- శరీర రోగ నిరోధక శక్తి. వైరస్‌ను గుర్తించకుండా చేసే కొన్ని మ్యుటేషన్లు ఉన్నాయి. అలాంటివి వ్యాక్సీన్ సమర్థతపై ప్రభావం చూపుతాయి. మరికొన్ని మ్యుటేషన్లు పూర్తి భిన్నంగా ఉంటాయి.
- ముందుగా అనుకున్న దానికంటే ఈ వేరియంట్‌లో మ్యుటేషన్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూ.హెచ్.ఓ . వెల్లడించింది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది.
- ఈ కొత్త వేరియంట్‌ను దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ మొదట గుర్తించారు. ఈ వేరియంట్ సోకిన వాళ్లకు చాలా తేలికపాటి కోవిడ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఆమె బీబీసీ కి చెప్పారు.
ఒమిక్రాన్ లక్షణాల గురించి స్పష్టమైన సూచనలు లేనప్పటికీ, ఈ కొత్త వేరియంట్ సోకిన వ్యక్తులలో అనుభవించిన సమస్యల ఆధారంగా దాని లక్షణాలు కొన్ని డెల్టా వైరస్ నుండి భిన్నంగా కనిపిస్తాయి. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ మొదటి కేసు టాంజానియాకు చెందిన వ్యక్తిలో కనుగొనబడింది. దీని తరువాత ఓమిక్రాన్ సోకిన మరో ఐదుగురు (5) వ్యక్తులను గుర్తించారు.
ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియంట్లలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా సంక్రమించే అంటువ్యాధిగా చెప్పబడుతోంది. ఇప్పటివరకు కనుగొనబడిన రోగులందరిలో కరోనాలో కనిపించే సాధారణ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. ఫ్లూ లాంటి సమస్యలూ బయటపడలేదు.
- ఒంటి నొప్పులు, తీవ్రమైన అలసట ఉన్నట్లు చాలా మంది రోగులు చెబుతున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ ఏంజెలిక్ కోట్జీ అన్నారు. అయితే, తాను చెబుతున్నది యువకుల గురించి మాత్రమేనని, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి గురించి కాదని ఆమె వివరించారు.
- అయితే, ఈ వేరియంట్ కలిగించే వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి ఇంకాస్త సమయం పడుతుందని డాక్టర్ ఏంజెలిక్ చెప్పారు.
- డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ చాలా వేగంగా ఇతరులకు సోకుతుందని నిపుణులు భావిస్తున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుందన డాని కి ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) (డబ్ల్యూ.హెచ్.ఓ) , చెప్పినప్పటి కీ, ఇది ఆందోళన కలిగించే విషయమే అని భావించాలి.
- అనేక మంది రోగులను విశ్లేషించిన తర్వాత ఒమిక్రాన్ రోగులలో సాధారణ జలుబు సమస్య అతి సాధారణం అని కనుగొనబడింది. అయితే మునుపటి వైరస్‌లోని ఇతర లక్షణాలు ఏవీ కనుగొనబడలేదు అని చెప్పారు.
- ఒమిక్రాన్ బారిన పడిన వ్యక్తులు జలుబు గురించి గందరగోళానికి గురవుతారని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని.. రుచి లేదా వాసన మాత్రమే పోతుందని ఆయన వెల్లడించారు.
- ఐదవ (5) రోగిలో గొంతు నొప్పి మరియు శరీర నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఇది కాకుండా, కొంతమంది రోగులలో తలనొప్పి, అలసట, శరీరం మరియు వంటి నొప్పులు వంటి ఫిర్యాదులు కూడా వచ్చాయి అన్నారు.
పై విషయాలు ఆధారంగా దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏంజెలిక్ కోయెట్జీ ఏం చెబుతున్నారంటే. ఓమిక్రాన్ మూడు ప్రధాన లక్షణాలు ఇవి అని చెప్పవచ్చు అవి ఏమిటంటే
💥 తలనొప్పి
💥 తీవ్రమైన అలసట
💥 ఒళ్లు నొప్పులు
💥 ఒమిక్రాన్ సోకినవారిలో అధికంగా జ్వరం రావటం, రుచి, సువాసనలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించడం లేదు.
భారత దేశంలో ఒమిక్రాజ్ వేరియంట్
భారత దేశంలో ఒమిక్రాజ్ వేరియంట్ విజృంభిస్తోంది. ఇప్పిటవరకూ దేశంలోని ఐదు రాష్ట్రాల్లో 32 కేసులు రికార్డయ్యయాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయిలో అలెర్ట్ అయ్యాయి.
- తెలుగు రాష్ట్రాల్లోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే మాస్క్ మస్ట్ అనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైనా మాస్క్ వేసుకోకుండా బయటకు వస్తే రూ.1000 ఫైన్ వేస్తామని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
- మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సరిహద్దు జిల్లాల అధికార యంత్రాంగాలను తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తాజాగా AP కూడా కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.100 ఫైన్ వేయనున్నారు. ఇక మాస్క్ లేనివారిని షాపులోకి రానిస్తే.. 10వేల నుంచి 25 వేల వరకూ ఫైన్ విధిస్తామనీ దుకాణా యజమానులకు సూచించింది. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది.
- రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మళ్లీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పక తీసుకోవాలని ప్రభుత్వాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. బయటకు వచ్చేటప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలంటూ నిబంధనలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు.
- ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులేవీ నిర్థారణ కాకపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.
ఒమిక్రాన్ సోకకుండా ఈ జాగ్రత్తలు తప్పక పాటించడం మంచిది.
- కరోనాను నివారించడానికి అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
- ఏవైనా లక్షణాలను బయటపడితే వెంటనే తనిఖీ చేయించుకుని, ఒంటరిగా ఉండండి.
- ఈ విధంగా మాత్రమే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు.
- మాస్క్‌ను సరైన విధానంలో ధరించాలి.
- సామాజిక దూరం 6 అడుగులు పాటించాలి.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ పదార్దాలు తిన రాదు
- ఇప్పటివరకు రెండు డోస్‌ల టీకాలను తీసుకోకపోతే.. వీలైనంత త్వరగా తీసుకోండి.
కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువ అయితే జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ హెచ్చరించడం తెలిసిందే. ఆ మేరకు అన్ని రాష్ట్రాలకు సందేశం పంపింది. ఒమిక్రాన్ బారినపడిన వారిలో అందరిలో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలపడం శుభసూచికం.
ఈ క్రింది వీడియో యు. ఆర్.యల్ . ల లో ఓమిక్రాన్ వైరస్ గురించి ఇంకా తెలుసుకోండి :
Todays Quote:
"Who you spend your time with will have a great impact on what kind of life you live. Spend time with the right people."
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
No comments:
Post a Comment