Showing posts with label ఊబకాయము. Show all posts
Showing posts with label ఊబకాయము. Show all posts

Sunday, July 26, 2020

మన శరీరంలో ఊబకాయాన్ని తగ్గించడానికి కొన్ని మనకి అందుబాటులో ఉన్న చిట్కాలు తెలుసు కోండి

మన శరీరంలో ఊబకాయాన్ని తగ్గించడానికి కొన్ని మనకి అందుబాటులో ఉన్న చిట్కాలు తెలుసు కోండి


భారీ శరీరం తో భాద పడే వీరినే కాదు సాధారణ బరువుతో ఉన్నవారి లో సహితం అధికం గా ఉన్న పొట్ట ఇబ్బందులకు గురి చేస్తుంది   దీనితో డయాబెటిస్, గుండెకు సంబందించిన వ్యాధులు ఎక్కువుగా వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు మనం ఎందరినో చూస్తున్నాం కూడా . శరీరం ఇతర భాగంలో కంటే పొట్ట భాగం మాత్రం లోతు గా ఉంటె ఆరోగ్యం అందం కూడా ఉంటుంది  అందుకే అనుభవజ్ఞులు అయిన కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు, బ్యూటీ పార్లర్  వాళ్ళు ఆచరించే సూచనలు మనం ఇప్పుడు తెలుసు కుందాం.

1. నిమ్మకాయ‌రసం:


ఉద‌యం లేవ‌గానే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక నిమ్మకాయ‌ను పూర్తిగా పిండి ఆ మిశ్రమాన్ని తాగాలి. దీంతో కొద్ది రోజుల్లోనే అధికంగా ఉన్న పొట్ట త‌గ్గిపోతుంది. కొవ్వును క‌రిగించే గుణాలు నిమ్మర‌సంలో ఉన్నాయి. అయితే ఈ మిశ్రమానికి కావాల‌నుకుంటే కొంత తేనెను కూడా క‌లుపుకోవ‌చ్చు.


2. అల్లం:

మ‌న శ‌రీరానికి మేలు చేసే అనేక ఆరోగ్యక‌ర ప్రయోజ‌నాలు అల్లంలో ఉన్నాయి. ఇది కొవ్వును క‌రిగించ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొంత అల్లం ర‌సం క‌లుపుకుని తాగుతున్నా ఫ‌లితం ఉంటుంది.

3. వెల్లుల్లి


శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే యాంటీ ఒబెసిటీ గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. నిత్యం కొన్ని వెల్లుల్లి రేకుల‌ను ఉద‌యాన్నే తిన‌గ‌లిగితే చాలు. పొట్ట ద‌గ్గర పేరుకుపోయిన కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.

4. బాదంప‌ప్పు


బాదంప‌ప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వును క‌రిగించ‌డంలో తోడ్పడుతాయి. ప్రతి రోజూ కొన్ని బాదం ప‌ప్పుల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

5. యాపిల్ సైడ‌ర్


ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను వేసి బాగా క‌ల‌పాలి. దీన్ని భోజనానికి క‌నీసం అరగంట ముందు తాగాలి. దీంతో ఆక‌లి బాగా త‌గ్గుతుంది. క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఈ క్రమంలో ఆహారం త‌క్కువ‌గా తింటారు. అంతేకాదు, కొవ్వును క‌రిగించే గుణాలు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌లో ఉండ‌డంతో బ‌రువు కూడా త‌గ్గుతారు.

6. పుదీనా ఆకులు


కొన్ని పుదీనా ఆకుల‌ను తీసుకుని వాటిని బాగా న‌లిపి ర‌సం తీయాలి. ఆ ర‌సాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. దీంతో పొట్ట ద‌గ్గర అధికంగా పేరుకుపోయిన కొవ్వు క‌రిగిపోతుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం కూడా పెరుగుతుంది. ఇది క్యాల‌రీల‌ను క‌రిగించ‌డంలో తోడ్పడుతుంది.

7. అలోవెరా జ్యూస్


ఉద‌యం, సాయంత్రం భోజనానికి అర‌గంట ముందు అలోవెరా జ్యూస్‌ ను 30 యమ్ . యల్ . మోతాదు లో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో బాగా క‌లిపి తాగాలి. దీంతో తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం అవుతుంది. పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌రిగిపోతుంది. శ‌రీరంలో అద‌నంగా కొవ్వు చేర‌దు. అంతేకాదు మ‌ల‌బ‌ద్దకం ఉన్నా పోతుంది.

8. పుచ్చకాయ ముక్కలు


భోజ‌నానికి ముందు పుచ్చకాయ ముక్కల‌ను తినాలి. దీంతో క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఇది మ‌నం తినే ఆహారాన్ని త‌గ్గించి బ‌రువు త‌గ్గేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

9. బీన్లు


బీన్లు  నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటున్నా ఫ‌లితం ఉంటుంది. ఇవి శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగిస్తాయి. జీర్ణక్రియ‌ను మెరుగు పరుస్తాయి. చాలా సేపు ఉన్నా క‌డుపు నిండిన భావన‌ను క‌లిగిస్తాయి. దీంతో ఆహారం తిన‌డం త‌క్కువై బ‌రువు త‌గ్గుతారు.

10. కీర‌దోస‌కాయ


కీర‌దోస‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో భోజ‌నానికి అర‌గంట ముందు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో తాగితే కొవ్వు క‌రిగిపోతుంది. ఇది క‌డుపు నిండిన భావ‌నను క‌లిగించి ఎక్కువ ఆహారం తిన‌కుండా చేస్తుంది.

11. ట‌మాటాలు











రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున బాగా పండిన 1 లేదా 2 ట‌మాటాల‌ను తినాలి. దీంతో పొట్ట ద‌గ్గ‌ర పేరుకుపోయిన కొవ్వు సుల‌భంగా క‌రిగిపోతుంది. ట‌మాటాల్లో ఉండే 9 ఆక్సో ఓడీఏ అనే ప‌దార్థం ర‌క్తంలో ఉన్న కొవ్వును తొల‌గిస్తుంది. 

12. వాము


వామునే అజ్వైన్ అని పిలుస్తారు. ఇందులో రైబో ఫ్లేవిన్స్ ఉంటాయి. ఇవి ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి. వాము, సోంపు గింజలు, యాలకులు, అల్లంను నీటిలో కలపాలి. అన్నింటినీ బాగా మరిగించి.. వడకట్టి.. సేవించాలి. అంతే.. బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో సహాయపడుతుంది.

13) మెంతులు


మొలకెత్తిన మెంతులు డయాబెటిస్ కి మంచి ఔషధంగా పనిచేస్తాయి. మెంతులు మొలకెత్తిన తర్వాత తీసుకొంటే డబల్ బెనిఫిట్స్ శరీరానికి అందుతాయి. దానిలో ఉండే పోషకాలు రెట్టింప అవుతాయి. డయాబెటిస్ లో పాంక్రియాస్ లో బీటా సెల్స్ ఆక్టివేట్ చేసి న్యాచురల్ గా ఇన్సులిన్ ఉత్పత్తిలో మెంతులు తోడ్పడతాయిడైలీ డైట్ లో మొలకెత్తిన మెంతులు కొన్ని చేర్చుకోవాలి. సలాడ్స్ , ఫ్రూట్ జ్యూస్ , కూరల్లో , మజ్జిగలో చేర్చుకొని తీసుకొంటే డయాబెటిస్ అదుపులో పెట్టుకోవచ్చు.

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ .ల లో ఇంకా తెలుసుకోండి



Note:  
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి,
నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి.  
అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి
అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogstpot.com  like,share and subscribe  చేయండి
Also, see my  You tube channel  bdl 1tv  like, share  and Subscribe, 
Also, see my  You tube channel  bdl Telugu tech-tutorials like, share  and Subscribe,కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్ , షేర్ , లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.




చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...