ఆర్ఆర్ వెంకటాపురంఎల్జీ కెమ్ పాలిమర్స్ ప్లాంట్‌లో 'స్టెరీన్' అనే విషవాయువు లీకేజీ దుర్ఘటన పూర్తి వివరాలు
![]() |
యల్.జి .పాలిమర్స్ గ్యాస్ లీకేజీ |
కరోనా వైరస్ నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే 'విశాఖపట్నం లోని గ్యాస్ లీకేజీ' దుర్ఘటన మన దేశాన్ని కుదిపేసింది. చిన్నాపెద్దా అంతా కలిపి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. అనేక మంది ఇంకా ఆసు పత్రి పాలవుతున్నారు. విశాఖపట్నం సిటీకి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది రాజా రత్నం వెంకటాపురం (ఆర్ఆర్ వెంకటాపురం) గ్రామం. అక్కడి ఎల్జీ కెమ్ పాలిమర్స్ ప్లాంట్‌లో 'స్టెరీన్' అనే విషవాయువు లీకేజీనే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. బాయిలర్ ట్యాంకుల్లో నిల్వ ఉన్న గ్యాస్ కెమికల్ రియాక్షన్ కారణంగా వేడెక్కిపోయింది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయం లో ప్లాంట్ పున:ప్రారంభించే సమయంలో గ్యాస్ లీకైందని గుర్తించారు.
అసలా ప్లాంట్ లో ఏం తయారుచేస్తారు.
మనందరం ఇళ్లలో వాడే ఎల్జీ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఫ్రిజ్.. తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారు చేసే సౌత్ కొరియన్ కంపెనీకి సిస్టర్ కంపెనీయే ఈ ‘ఎల్జీ కెమ్'. ఆ సంస్థకు మన దేశంలో 20కిపైగా ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్‌లో ప్రధానంగా పాలిస్టెరీన్, సింథటిక్ ఫైబర్ ను తయారుచేస్తారు. మనం నిత్యజీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తుల్లో మెజార్టీ శాతం పాలిస్టెరీన్ నుంచి తయారైనవే. ఫుడ్ ప్యాకింగ్ కు వాడే ప్లాస్టిక్ డబ్బాల నుంచి టీవీలు, రిఫ్రిజిరేటర్లు తదితర పరికరాల్లో వాడే ప్లాస్టిక్ వస్తులునూ పాలిస్టెరీన్ తోనే రూపొందిస్తారు. ప్రపంచం లో ఇప్పటిదాకా కనిపెట్టిన 118 మూలకాల్లో ఒకటైన బెంజీన్ నుంచి పుట్టిందే ఈ స్టెరీన్ అనే కెమికల్ కాంపోనెంట్. చాలా ఏళ్ల కిందట శాస్త్రవేత్తలు స్వీట్‌గమ్ చెట్ల నుంచి జిగురు రూపంలో స్టెరీన్ ఉత్పత్తికావడాన్ని సైంటిస్టులు గుర్తించారు.
పాలిమర్స్ స్టెరిన్ వాయువు వల్ల ఏమవుతుంది
స్టెరీన్ అనే వాయువు ను పీల్చినవెంటనే మనకు విపరీతమైన ఇరిటేషన్ పుడుతుంది, తలనొప్పి, వినికిడి సమస్య, కళ్లు మంటలు, కొన్నాసార్లు చూపు కోల్పోయే ప్రమాదం కూడా సంభవిస్తుంది.
నివారణ చర్యలు
గుజరాత్ నుంచి.. విష వాయువుల ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన కెమికల్స్‌ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెప్పించబోతోంది. దీనికోసం ముఖ్యమం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీతో ఫోన్‌లో మాట్లాడినట్టు సమాచారం తెలిసింది. విషవాయువుల తీవ్రతను తగ్గించడంలో పారా-టెరిటియరీ బ్యూటిల్ క్యాట్‌ఛాల్ (పీటీబీసీ) కెమికల్స్ గుజరాత్‌లోని వాపి నగరంలో గల పారిశ్రామికవాడల్లో పెద్ద ఎత్తున తయారవుతున్నట్లు ప్రబుత్వం తెలుసుకుంది.
హుటా హుటిన ఈ కెమికల్ తెప్పించి విశాఖ పట్నం బాధిత ప్రాంతాల్లో జల్లించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి విష వాయువుల తీవ్రతనైనా తగ్గించగలిగే ఈ పీ.టి.బి.సి. కెమికల్ కు ఉందని అందువల్లే దీనిని 500 కె.జీ. వరకు ఆం.ప్ర. ప్రభుత్వం రప్పిస్తున్నారు.
ఎల్‌జీ కెమికల్స్ వారి స్పందన
- విషవాయువుల లీకైన ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ కెమికల్స్ స్పందిం చింది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సంస్థ ప్రస్తుతం గ్యాస్ లీకేజీ అదుపులోకి వచ్చినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.
- ప్రమాదం జరిగిన సమయంలో కరోనావైరస్ కట్టడికి అమలువుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా ప్రభావిత కర్మాగారాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపింది. లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
- సంబంధిత సంస్థల సహకారంతో ప్రజలు, తమ ఉద్యోగులను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎల్‌జీ పాలిమర్స్ యజమాన్య సంస్థ ఎల్‌జీ కెమ్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఎల్జీ పాలిమర్స్ సంస్థ చుట్టుపక్కల ప్రాంతాలు
- ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం
- టైలర్స్ కాలనీ
- ఇందిరానగర్
- నాయుడుతోట
- వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్డు
- సింహాచలానికి వెళ్లే మార్గాలు
- కొత్తపాలెం
- భగత్‌సింగ్ నగర్
- మాధవాపురం
- సింహపురి కాలనీ
- కృష్ణరాయపురం
- పొర్లుపాలెం
- సంతోష్ నగర్
- కాకాని నగర్
- వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
- ఎల్జీ పాలిమర్స్ సంస్థ ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం
- టైలర్స్ కాలనీ
- ఇందిరానగర్
- నాయుడుతోట
- వ్యవసాయ మార్కెట్ కమిటీ రోడ్డు
- సింహాచలానికి వెళ్లే మార్గాలు
- కొత్తపాలెం
- భగత్‌సింగ్ నగర్
- మాధవాపురం
- సింహపురి కాలనీ
- కృష్ణరాయపురం
- పొర్లుపాలెం
- సంతోష్ నగర్
- కాకాని నగర్
- వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున శుద్ధి కార్యక్రమాలను చేపట్టారు.
హెలికాప్టర్ ద్వారా సముద్రపు నీటిని తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లో చల్లుతారు. పీ.టి.బి.సి.(గుజరాత్‌లోని వాపి నగరం నుంచి) కెమికల్ 500 కె.జీ. వరకు ఆం.ప్ర. ప్రభుత్వం విశాఖకు రప్పిస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఈ కెమికల్స్ విశాఖపట్నానికి చేరకుంటాయని భావిస్తున్నారు.
ఈక్రింది వీడియోయు.ఆర్.యల్.లో మరింతతెలుసుకోండి