బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి? ఎవరికి సోకుతుంది? దాని లక్షణాలేమిటీ? ఎలా చెక్ పెట్ట వచ్చు?
ఇప్పుడు భారత దేశం కరోనా వైరస్‌తో చాల ఇబ్బంది పడుతుంటే ఈ బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్ - Mucormycosis) ఒకటి కొత్తగా వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న పేషెంట్లకు ఇది ఎక్కువగా సోకుతోంది. కొన్ని గుంపుగా ఉంటూ ఈ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఈ వైరస్ పాతదే అయినా ఇప్పుడు దీని వ్యాప్తి ఇప్పుడు ఎక్కువైంది.
బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి ?
మ్యుకోర్ మైకోసిస్ అనేది ఓ అరుదైన శిలీంద్రం. తేమతో కూడిన ఉపరితలాలపై ఎక్కువగా కనిపిస్తుంటుంది. నల్లగా బూజు పట్టినట్లు ఉండటం వల్ల దీన్ని బ్లాక్ ఫంగస్‌గా వ్యవహరిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ఈ బ్లాక్ ఫంగస్ గురించి కొన్ని సూచనలు చేశారు. ట్విట్టర్ ద్వారా వాటిని అతను పంచుకున్నారు.
బ్లాక్ ఫంగస్ - భారత ఆరోగ్య కేంద్రం సూచనలు:
- బ్లాక్ ఫంగస్ అనారోగ్యంతో బాధపడే వాళ్లకే (వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి) సోకుతుంది.
- ఇది సోకితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి మరింత తగ్గిపోతుంది.
- మొదట్లోనే దీన్ని గుర్తిస్తే వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు.
‘బ్లాక్ ఫంగస్’ ఎవరికి సోకుతుంది? దాని లక్షణాలేమిటీ?
- డయాబెటీస్ నియంత్రణలో లేని కరోనా బాధితుల్లో ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతున్నట్లు గుర్తించారు.
- కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్సల కోసం ఇమ్యునిటీ కంట్రోల్ డ్రగ్స్ వాడిన రోగుల్లో కూడా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడుతోంది.
- దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఉంటుంది. అలాగేవొరికొనజోల్ మందులు వాడుతున్న వారికి,
- డయాబెటిస్ ఎక్కువగా ఉన్నవారికి,
- ఇదివరకే అనారోగ్య సమస్యలున్న కరోనా బాధితులకు స్టిరాయిడ్స్ అతిగా ఇవ్వడం వల్ల ఈ సమస్య ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు.
- సైనసైటిస్ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్ ఫంగస్ ఏర్పడవచ్చు.
- స్టెరాయిడ్లు వాడే వారికి, ICUలో ఎక్కువ కాలం ఉండే వారికి ఇది సోకగలదు.
- ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి ఏర్పడుతుంది.
- బ్లాక్ ఫంగస్ వల్ల కళ్లు ఎర్రబడతాయి.
- ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి.
- తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.
- మానసిక స్థితి అదుపుతప్పడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
- ముక్కులో దురద, కళ్లపైన లేదా కళ్ల కింద ఉబ్బినట్లు కనిపించినా, కంటిచూపు మందగించినా వైద్యులను సంప్రదించాలి.
- దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి.
- రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఈ ఫంగస్ ఏర్పడవచ్చు.
- కోవిడ్ బాధితులందరికీ ఈ ఫంగస్ ఏర్పడదు. కాబట్టి.. అందోళన వద్దు.
- కోవిడ్ చికిత్స పొందేవారు ఇదివరకు ఏమైనా వ్యాధులలతో బాధపడినా, శస్త్ర చికిత్సలు చేయించుకున్నా వైద్యులకు ముందుగా తెలియజేయాలి.
- కోవిడ్ చికిత్స అందించే వైద్యులకు ముందుగా మీ అనారోగ్య సమస్యలను తెలియజేస్తే.. ఫంగస్ ఏర్పడకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.
- డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడకుండా జాగ్రత్త పడటం ద్వారా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.
- కోవిడ్ బాధితులకు ‘హ్యూమిడిఫయర్లు’ ద్వారా ఆక్సిజన్ అందిస్తారు. వీటిలో స్టెరైల్ వాటర్‌ను ఉపయోగించాలి. వాటికి బదులు సాధారణ నీటిని వాడితే ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడే ప్రమాదం ఉందని అహ్మదాబాద్‌కు చెందిన సీనియర్ కార్డియలజిస్ట్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ ఆక్సిజన్‌కు ఉపయోగించే హ్యూమిడిఫయర్లలో కేవలం స్టెరైల్ నీటిని మాత్రమే వాడాలని తెలిపారు.
- కొన్ని హాస్పిటళ్లు, ఐసోలేషన్ కేంద్రాలు, హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు సాధారణ నీటిని ఉపయోగిస్తున్నారని, వాటిలో ఉండే సూక్ష్మ జీవులు శరీరంలోకి చేరడం వల్ల ఫంగస్ ఏర్పడుతుందన్నారు. హ్యూమిడిఫయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నీటిని మార్చడం ద్వారా ఈ సమస్య నుంచి కాపాడవచ్చని తెలిపారు.
- డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
- కరోనా నుంచి రికవరీ అయిన డయాబెటిస్ ఉన్న వారు హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాక షుగర్ లెవెల్స్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
- స్టెరాయిడ్లు ఇష్టమొచ్చినట్లు కాకుండా జాగ్రత్తగా వాడాలి.
- బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.
- కరోనా సోకి ట్రీట్‌మెంట్ తీసుకునేటప్పుడు ముక్కు రంధ్రాలు మూసుకుపోతే అది బ్లాక్ ఫంగస్ వల్ల కూడా కావచ్చని అనుకోవాలి.
- ఈ వ్యాధి కి వెంటనే ట్రీట్‌మెంట్ అందించడం ద్వారా రోగిని బతికించవచ్చు.
- ఇది అంటు వ్యాధి కాదు. ఒకరి నుంచి ఇతరులకు సోకదు.
- వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటే ఇది మనల్ని ఏమీ చెయ్యలేదు.
ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి. సొంత వైద్యం ఆరోగ్యానికి హానికరం. సమాచారానికి పూర్తిగా ఇంటర్నెట్ వెబ్ సైట్ ల నుండి సేకరించడం జరిగింది ఈ బ్లాగ్ సమాచారం కేవలం సమాచారం మాత్రమే . శాస్త్రీయ విషయాల లో ఉండే లోటు పాట్లకు ఈ బ్లాగ్ బాధ్యత వహించదు.
ఈ రోజు సూక్తి :
Note 2:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
No comments:
Post a Comment