Sunday, July 19, 2020

కరోనా వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించు కోవడాని కి ఎటువంటి ఆహార పదార్దాలు వాడాలి అనేది తెలుకొని ఈ మహమ్మారి నుండి మనల్ని మనమే రక్షించు కుందాం

కరోనా  వ్యాధి నుంచి  మనల్ని మనం  రక్షించు  కోవడాని కి ఎటువంటి ఆహార పదార్దాలు వాడాలి అనేది తెలుకొని ఈ మహమ్మారి నుండి మనల్ని మనమే రక్షించు కుందాం


చైనాలో వుహాన్  నుంచి ప్రారంభం అయి ఈ కరోనా వ్యాధి ప్రపంచమంతా వ్యాపించి పోయింది ఎక్కడ చూసిన ఈ వ్యాధి భారిన పడిన వారు సంఖ్య రోజు రోజు కీ పెరిగి పోతూనే ఉంది. ఈవ్యాధి బారి న పడి మరణించిన  వారి సంఖ్య తక్కువే అయినప్పటికీ వ్యాధి వ్యాప్తి మాత్రం చాల ఎక్కువ గానే ఉంది, తాత్కాలికమైన కొన్ని మందుల తో చాల మందికి ఉపశమనము కలుగుతున్నప్పటికీ మన శరీరం లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడ మొక్కటే మరణం నుంచి తప్పించుకొనే ఏకైక  మార్గమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధికి వాక్సిన్ కనుకున్నామని చెబుతున్నప్పటికీ పూర్తీగా వాడుకలోకి రావడానికి ఇంకా కనీసం  6 నెలల వరకు పట్టవచ్చని డాక్టర్లు కెమిస్టులు చెబుతున్నారు. 

అయితే మన శరీరం లో ఎటువంటి పోషక పదార్దాల వల్ల ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అవి ఏ ఏ ఆహార పదార్దాలలో ఉన్నాయో మనం తెలుసుకుందాం 

  • అల్లం : అల్లం లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది . అర అంగుళం అల్లం ముక్క ప్రతి రోజు పచ్చిగాగని ఆహార పదార్దాలతో గాని కలిపి తీసుకొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం కాల్చు కొని దానితో తేనె గాని ఉప్పు గాని అద్దుకొని తిన వచ్చు. దీని వల్ల రొంప దగ్గు జ్వరం రాకుండా ఉండడమే కాకుండా  వైరస్ రాకుండా కాపాడుతుంది.

  • బచ్చలి కూర :  బచ్చలి కూరలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ గా ఉంటుంది. విటమిన్ సి'  దీనిలో ఉండే అంటి ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ లు ఎలాంటి వ్యాదులు రాకుండా మనల్ని కాపాడుతుంది 

  • పాల  కూర :  బచ్చలి కూరలాగే  పాలకూర కూడా చాల అంటి ఆక్సిడెంట్లు విటమిన్' సి' విటమిన్ 'కె' , బీటా కెరోటిన్ ను  కలిగి వుంది.

  • బ్రౌన్ రైస్ : బ్రౌన్ రైస్ (దంపుడు బియ్యం ) ఒక్కప్పుడు అందరు దంపుడు బియ్యమే గ్రామాలలో వాడే వారు  అయితే బియ్యం మిల్లులు ఎపుడైతే వచ్చాయో  దంపుడు బియ్యం వినియోగం తగ్గి పోయింది దీని లో కూడా పోషక విలువలు బాగానే ఉన్నాయి . అంటి ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ గా ఉన్నాయి.

  • క్యారట్  : బీటా కెరోటిని విటమిని బి 6 ఎక్కువ ఉండడం వాళ్ళ కంటి కి ఒంటికి కూడా చాల ఆరోగ్యప్రదం. ప్రతి రోజు అరా కప్పు కారట్ జ్యూస్ లేదా ఆహార పదార్దాలో వాడడం లేదా ఫ్రూట్ సలాడ్ గా గాని వాడితే చాల మంచిది.

  • గుమ్మిడి కాయ గింజలు: బీటా కెరోటిన్ ఎక్కువ ఉండడం వాళ్ళ ఇమ్మ్యూనిటి బాగా పెరుగుతుంది .

  • అవిసె  గింజలు : ఆల్ఫా లీనో లెనిక్ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఎక్కువగా ఉండడం వాళ్ళ , ఇమ్మ్యూనిటి బాగా పెరుగుతుంది. 

  • దాల్చిన చెక్క : దాల్చిన చెక్క  పాలీ పీనల్ స్ అనే అంటి ఆక్సిడెంట్లు మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి .

  • వెల్లుల్లి  : రోజు ఒకటి రెండు పచ్చి వెల్లులి రెబ్బలు తింటే మన శరీరం అంటి బాడీస్ పెరిగి ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది. వెల్లుల్లి లో అంటి ఫంగస్, వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. కూరలలో అయితే మాములుగా కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి . 

  • నీళ్లు :రోజు పరిశుద్ధమైన తగినంత నీరు కాచి చల్లార్చిన నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు పడి  వైరస్ మన దరి చేరాడు 

  • లవంగాలు   : విటమిన్ 'సి' ఫైబర్, మాంగనీస్, విటమిన్ 'కె ' ఉండడం వల్ల మన రోగ నిరోధకత బాగా పెరుగుతుంది.

  • మిరియాలు :  మిరియాల లో అంటి బాక్ట్రయల్ అంటి వైరల్ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మిర్యాలు తాలింపులలో మాములు 4-5 గింజలు వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. జ్వరం, దగ్గు, కఫం ఉన్నప్పుడు మిరియాల కషాయం 1 కప్పు వాడడం మనకి ఎపుడో తెలుసు.

  • జీలకర్ర : జీలకర్ర లో పాలిపేరాన్ అనే పదార్థం మనలో ఇమ్మ్యూనిటీని పెంచుతుంది . మాములు కంటే కొద్దిగా పోపులో ఎక్కువ వాడితే మంచిది. మన శరీరం లో ఉబకాయాన్ని తగ్గించు కోవడానికి జీల కర్ర పొడి రోజు 1నించి 2 స్పూన్ లు వాడుతుంటారు. 

  • పసుపు :పసుపు ఒక సాధారణ మసాలా. పసుపుని మనం వంటకాలకే  కాక , దెబ్బలకు కు కూడా పూస్తాము . మనకి పసుపు ఏంతో మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఫంగల్ మరియు యాంటీబాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉందని చెపుతారు. మరియు ఇది వ్యాధి కలిగించే బ్యాక్టీరియా మరియు వైరస్లకు వ్యతిరేకంగా శరీరం యొక్క సహజ రక్షణను కల్పించడం లో సహాయపడుతుంది.
  • తులసి ఆకులు: రోజు ఒక నాలుగు తులసి ఆకులూ నమలడం వల్ల కడుపులోని దుర్వాసన పోయి శరీరం లో విషపూరిత బాక్టేరియా ను పారత్రోలుతుంది. హిందువులు తులసి ఆకుల రసాన్ని గుడి లో తీర్థం గా పుచ్చుకుంటు ఉండడం హిందువులందరికి తెలిసిందే .

  • బాదం పప్పు :రోజు నాలుగు అయిదు బాదం పప్పులు వాడడం వాళ్ళ విటమిన్' ఈ ' పెరిగి శరీరం లో ఇమ్మ్యూనిటి పెరుగుతుంది. 

  • నిమ్మ, నారింజ, ఉసిరి   : నిమ్మ నారింజ, ఉసిరి,లో విటమిన్ 'సి ' పుష్కలం గా ఉంటుంది.  లెమన్ శాల్టీ వాటర్ , నారింజ తొనలు తరుచు వాడండి. ఉసిరికాయ పచ్చడి లేదా సాల్ట్ లో నానపెట్టిన ఉసిరి గాని తినండి . ఉసిరి రక్త స్రావాన్ని నివారించి ఇమ్మ్యూనిటి పెంచుతుంది 

  • ప్రొద్దు తిరుగుడు గింజలు : వీటిలో ఫాస్పరస్, మెగ్నీషియం ,విటమిన్ బి 6 పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజలు పొడి చేసి నీటిలో కలుపుకు తాగ వచ్చు. 

  • పెరుగు  రోజు ఒక కప్పు పెరుగు తినడం వాళ్ళ జీర్ణాశయం లో బాక్టీరియా నశించి ఇమ్మ్యూనిటి పెరుగుతుంది.

  • పుచ్చకాయ లేదా వాటర్ మెలోన్   : పుచ్చకాయ జ్యూస్ తగిన గింజలు తిన్న చాల మంచిది.

  • బొప్పాయి : బొప్పాయి లో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి దోహద పడుతుంది 

  • నేరేడు పండ్లు నేరేడు పండ్ల లో కూడా రోగనిరోధ శక్తి ఎక్కువ .

  • అరటి ఆప్రికాట్:  ఈ రెండింటి లో కూడా రోగనిరోధక శక్తి ఎక్కువ గా ఉంటుంది. వీటిలో పొటాషియం ఎక్కువ గా ఉండడం వాళ్ళ హై బి.పి. ని నివారిస్తుంది

  • కివి పండ్లు: వీటిలో కావలిసినంతపొటాసియం,విటమిన్'కే'.విటమిన్'సి " పుష్కలం గా ఉంటాయి . దేనివల్ల మనలో ఇమ్మ్యూనిటి బాగా పెరుగుతుంది.

  • గ్రుడ్లు : గ్రుడ్ల లో ప్రోటీన్ లు విటమిన్ లు రోజుకి ఒక గుడ్డు తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 
  • గ్రీన్ టీ :గ్రీన్ టీ లో ఉండే ప్లేమనైడ్ ల వాళ్ళ అంటి ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి రోగనిరోధక శక్తి శరీరం లో పెరుగుతుంది .

  • తేనె  : తేనె కలిగి ఉన్న మంచితనాన్ని ఎంత వివరించిన తక్కువే. ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకి ఉంది. తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు పుప్పొడి ఉన్నాయి, ఇవి క్రిమినాశక మందులుగా తయారవుతాయి మరియు కాలానుగుణ అలెర్జీల నుండి ఇది రక్షిస్తుంది.

పై ఆహార పదార్దాలు అన్ని రోజు తీసుకో లేక పోయిన పైన ఉదాహరించిన ఏవైనా రోజుకు 3 లేదా 4 రకాలు ఒక రోజు ఒక రకం ఇంకొక రోజు ఇంకొక రకం తీసుకోవచ్చు .  మనకు ఎప్పుడు ఉండే పైన ఉదహరించిన ఆహార పదార్దాలు మాత్రం విడువ కుండా తగిన మో తాదు లో తింటుండాలి. ఈ విధం గా మన ఆహార నియమాలు  ఏర్పాటు చేసు కున్న ట్లైతే  కరోనా ఏ కాదు  ఎటువంటి వ్యాధులు మన దగ్గరకు రాడానికే బయపడతాయి.  ఈ ఆహారాలు  మన శరీరంలో  వ్యాధి నిరోధక శక్తి పెంచాడనికి మాత్రమే పనికి వస్తాయి. ఒక వేళ కరోనా సూచనలు ఉన్న లేదా వ్యాధి వచ్చిందని తెలిసిన డాక్టర్ సూచించిన మందులు డైట్ పాటించడం తప్పని సరి .

ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్ . లు చూడండి 

తిండిని బట్టే మన ఇమ్యూనిటీ | | V6 Velugu

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ














No comments:

Post a Comment

చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు”

 “ చైనాలో ఆవిష్కరించిన స్వర్గపు గుహ – గ్వాంగ్జీ సింక్‌హోల్ రహస్యాలు” గ్వాంగ్జీ సింక్‌హోల్ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లో ఒక క...