Friday, April 24, 2020

కరోనావైరస్ (కోవిడ్-19) మన శరీరం లోకి ఎలా ప్రవేశిస్తుంది దీని లక్షణాలు ఈ వైరస్ నివారించా లంటే ఏమి చేయాలి ?

కరోనావైరస్ (కోవిడ్-19)  మన శరీరం లోకి ఎలా ప్రవేశిస్తుంది  దీని లక్షణాలు  ఈ వైరస్ నివారించా లంటే ఏమి చేయాలి ?


కరోనా వైరస్‌లు మన శరీరంలోని కణాలలోకి వెళ్లి, వాటిని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటాయి.

  • కొత్త రకపు కరోనావైరస్‌ను అధికారికంగా సార్స్-కోవ్-2 అని పిలుస్తున్నారు. మనం ఈ వైరస్‌ను శ్వాసలోకి పీల్చినపుడు (ఇది సోకిన వారు ఎవరైనా మనకు దగ్గరగా ఉండి దగ్గినపుడు), లేదా ఈ వైరస్‌తో కలుషితమైన ప్రాంతాన్ని చేతులతో ముట్టుకుని, అవే చేతులతో మన ముఖాన్ని ముట్టుకున్నపుడు ఇది మన శరీరంలోకి చొరబడుతుంది.

  • మొదట మన గొంతు, శ్వాస నాళాలు, ఊపిరితిత్తుల్లో ఉన్న కణాలలోకి ఇది వ్యాపిస్తుంది. వాటిని 'కరోనావైరస్ కర్మాగారాలు'గా మార్చేస్తుంది. అంటే.. అక్కడ వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడి నుంచి మరిన్ని శరీర కణాల మీద దాడి చేస్తుంది.

  • ఇది ప్రాథమిక దశ. ఈ దశలో మనం జబ్బుపడం. అసలు కొంతమందికి ఎటువంటి లక్షణాలూ కనిపించకపోవచ్చు.

  • వైరస్ తొలుత సోకినప్పటి నుంచి వ్యాధి మొదటి లక్షణాలు కనిపించే వరకూ పట్టే కాలం- ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. అయితే.. ఈ కాలం సగటున ఐదు రోజులు (5) డేస్ ) గా ఉంది.

  • కరోనావైరస్ వల్ల వచ్చే దగ్గు ఆరంభంలో పొడిగా ఉంటుంది. అంటే తెమడ వంటిదేమీ రాదు. వైరస్ సోకినపుడు కణాల్లో కలిగే అలజడి బహుశా దీనికి కారణం కావచ్చు.

  • కొన్ని రోజులు గడిచిన తర్వాత కొందరిలో దగ్గుతో పాటు తెమడ కూడా వస్తుంది. వైరస్ సంహరించిన ఊపిరితిత్తుల కణాలు ఈ తెమడ రూపంలో బయటకు వస్తాయి.

  • ఈ లక్షణాలకు శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తూ ఎక్కువ మోతాదులో ద్రవాలు అందించటం, పారాసెటమాల్ మందులతో చికిత్స అందిస్తారు. ప్రత్యేకమైన ఆస్పత్రి చికిత్స అవసరం ఉండదు.

  • ఈ దశ ఒక వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఆ సమయానికి చాలా మంది కోలుకుంటారు. ఎందుకంటే వారిలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడి దానిని తరిమేస్తుంది.

  • అయితే, కొంతమందిలో కోవిడ్-19 వ్యాధి మరింతగా ముదురుతుంది. ఈ దశలో ముక్కు కారటం వంటి జలుబు వంటి లక్షణాలు కూడా రావచ్చని పలు అధ్యయనాల్లో తెలుస్తోంది.

కరోనా-19 వైరస్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి

  • కరోనావైరస్ ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. జ్వరంతో మొదలై, పొడి దగ్గు రావడం, ఆ తరువాత శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది రావడం ఈ వైరస్ లక్షణాలు.
  • ఈ వైరస్ సోకితే దగ్గు ఆగకుండా వస్తుంది. ఒక్కోసారి గంటకు పైగా దగ్గు వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో అలా సుదీర్ఘమైన దగ్గు రెండు మూడు సార్లు వస్తుంది. మీకు మామూలుగానే దగ్గు సమస్య ఉంటే, వైరస్ వల్ల కలిగే దగ్గు మరింత తీవ్రంగా ఉంటుంది.
  • శరీర ఉష్ణోగ్రత (జ్వరం) 100 డిగ్రీల ఫారిన్ హీట్ దాటుతుంది. దీంతో శరీరమంతా వెచ్చగా కానీ, చల్లగా కానీ ఉంటుంది. కొందరి శరీరం వణికిపోతుంటుంది.
  • సాధారణంగా ఈ లక్షణాలు కనిపించడానికి 5 రోజుల సమయం పట్టొచ్చు. అయితే, కొందరిలో ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం కరోనావైరస్ సోకిన వ్యక్తిలో లక్షణాలు కనిపించడానికి (ఇంక్యుబేషన్ వ్యవధి) 14 రోజుల వరకూ సమయం పట్టవచ్చు.
సాధారణ జాగ్రత్తలు
కరోనావైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సూచించింది అవి ఏమిటంటే...
  • ముఖ్యంగా ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవాలి.

  • దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారికి కనీసం ఒక మీటరు నుంచి మూడు మీటర్ల దూరంలో ఉండాలి.

  • ఈ లక్షణాలు ఉన్నవాళ్లు సమీప డాక్టర్ను సంప్రదించాలి. తీవ్రమైన లక్షణాలు ఉంటె తెలుగు రాష్ట్రాల్లో 104, 108 లకు ఫోన్ చేయాలి 

  • ఆ రెండు లక్షణాలతో బాధపడుతున్నవారు తుమ్మినా లేదా దగ్గినా టిష్యూ లేదా బట్ట అడ్డు పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.

  • ప్రయాణాల్లో, షాపింగ్ సమయాల్లో, ఆఫీసుల్లో అవసరమైన ప్రతి వస్తువును చేతితో తాకుతునే ఉంటాం. ఆ సమయంలో వైరస్ సోకే అవకాశం ఉంది. 

  • అవే చేతులతో కళ్లను నలిపినా, ముక్కును, నోటిని తాకినా ఆ వైరస్ శరీరంలోకి ప్రవేశించవచ్చు. కనుక అదే పనిగా చేతులతో కళ్లను, నోటిని, ముక్కును తాకవద్దు.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు

  • ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి పెంపుడు జంతువులు లేదా ఇతర జంతువులకు దూరంగా ఉండాలి.

  • పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకూడదు.

  • జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనావైరస్ మహమ్మారిని కనిపెట్టేందుకు, నిర్ధారించేందు కు 2 రకాల పరీక్షలు ఉన్నాయి.
1.యాంటీజెన్ లేదా మనకు కరోనావైరస్ సోకిందా అనేది తెలుసుకోవడానికి ?:

ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకిందా, సోకితే అతడు వేరేవారికి దాన్ని వ్యాపింపచేసే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయి అనే విషయాలను ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. తీవ్రంగా జబ్బుపడిన రోగులకు హాస్పటళ్లలో ప్రస్తుతం ఈ పరీక్షనే నిర్వహిస్తున్నారు.

2. యాంటీబాడీ లేదా నాకీ మధ్య కరోనావైరస్ వచ్చిందా అనేది తెలుసుకోడానికి ?:
ఇది ప్రజలకు ప్రస్తుతం (ఇంగ్లండ్‌లో) అందుబాటులో లేదు. కానీ లక్షల మందికి ఈ పరీక్ష నిర్వహించాలని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ ఆదేశించింది. దీనివల్ల ఎంతమంది ప్రజలు అసలు ఎలాంటి లక్షణాలు లేకుండా లేదా ప్రాథమిక లక్షణాలతో కరోనావైరస్ బారిన పడ్డారు అనే విషయం తెలుసుకోవచ్చు.
కరోనావైరస్‌ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఈ రెండు పరీక్షలూ చాలా ముఖ్యమైనవి.

ప్రజలు ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాల్సి ఉంటుంది

  • కరోనావైరస్ సోకిన వారిలో చాలామంది విశ్రాంతి తీసుకుని, పారాసెటమాల్ వంటి మాత్రలు తీసుకుని కోలుకుంటున్నారని తేలింది 
  • అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంటే మాత్రం ఆసుపత్రిలో వైద్యం అవసరమవుతుంది.
  • ఊపిరితిత్తులు ఎంతగా దెబ్బతిన్నాయో డాక్టర్లు పరీక్షించి తదనుగుణంగా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టుతో వైద్యం అందిస్తారు.
  • అయితే, తీవ్రంగా జబ్బుపడి, మీ రోజువారీ కార్యక్రమాలను కూడా చేసుకోలేక పోతున్నప్పుడు ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలను కానీ, ప్రభుత్వం ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లను కానీ సంప్రదించాలి.
  • శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతుంటే, కొన్ని పదాలకు మించి మాట్లాడలేకపోతుంటే మాత్రం తక్షణం 104, 108 వంటి ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలి.
ఇంటెన్సివ్ కేర్‌ అంటే ఏమిటి ?
తీవ్రంగా జబ్బుపడ్డ వారికి వైద్యం అందించే ప్రత్యేక వార్డులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూ) అంటారు.

కరోనావైరస్ సోకిన పేషెంట్లకు ఐసీయూల్లో ఫేస్ మాస్కు లేదా ముక్కు ద్వారా లోపలికి వేసిన గొట్టం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తారు.

ఇంకా ఎక్కువగా జబ్బుపడ్డ రోగులకైతే వెంటిలేటర్ల ద్వారా ప్రాణవాయువును అందిస్తారు. నోరు, ముక్కు ద్వారా కానీ, గొంతును కోసి కానీ ఒక గొట్టాన్ని లోపలికి పంపించి, ఊపిరితిత్తులకు నేరుగా ఆక్సిజన్ అందేలా చేస్తారు.

కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు అందరూ మరణిస్తారా ?

  • ప్రతి వెయ్యి(1000) కరోనావైరస్ కేసుల్లో ఐదు(5) నుంచి నలభై (40 )కేసుల్లో రోగి మరణించే ఆస్కారం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. 
  •  సరిగా చెప్పాలంటే- వెయ్యి మంది(1000) లో తొమ్మిది (9) మంది అంటే దాదాపు ఒక శాతం (1%) మంది బాధితులు చనిపోయే ప్రమాదం ఉంటుంది.
  • బ్రిటన్  ప్రకారమైతే మరణాల రేటు రెండు శాతం (2%) లేదా అంతకంటే తక్కువగా ఉండే ఆస్కారముందని ఆదేశ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాథ్ హాన్‌కూక్ ఆదివారం చెప్పారు.
  • బాధితుల వయసు, లింగం, ఆరోగ్య స్థితి, వారు నివసించే ప్రాంతంలో ఉండే ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ లాంటి అంశాలపై కోవిడ్- 19 మరణాల రేటు ఆధారపడి ఉంటుంది.
  • రోనావైరస్ వ్యాధి బారినపడ్డవారికి సంబంధించిన గణాంకాలను చూస్తే, చనిపోయిన వారి శాతం చాలా తక్కువ.
  • ఈ గణాంకాలన్నీ పూర్తిగా విశ్వసనీయమైనవి కాకపోయినా, కరోనావైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మరణాల రేటు ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఉంటుంది.
  • ఇది మనిషి నుంచి మనిషికి త్వరగా వ్యాపించి పాజిటివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో (కరోనావైరస్ కేసులు) నమోదవుతున్నాయి.
  • చాలా కేసులు ఇప్పటికీ ఆరోగ్య సంస్థల దృష్టిలోకి రావట్లేదని అధికారులు భావిస్తున్నారు. వీటిలో చాలా కేసులు అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, దక్షిణ కొరియాల్లోనే నమోదయ్యాయి.

ఈ క్రింది వీడియో లింక్లు చూడండి...

Coronavirus Symptoms,Precautions || కరోనా వైరస్ ..




Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.













No comments:

Post a Comment

వైజాగ్ రుషికొండ బీచ్ పాలస్ వివరాలు పూర్తిగా

వైజాగ్ రుషికొండ బీచ్ పాలస్ వివరాలు పూర్తిగా  రుషికొండ బీచ్ పాలస్  వైజాగ్ రుషికొండ బీచ్ పాలస్ ఎప్పుడు కట్టారు. ఎన్ని గదులు వాటి విలువ. బిల్డి...