ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం S.P. Bala Subrahmanyam Health Bulletein
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం గా ఉందని యమ్.జీ.యమ్. ఆస్పత్రి వర్గాలు తెలియ చేస్తున్నాయి . భారత దిగ్గజ గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (S.P.Balasubrahmanyam) ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ గురువారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.
గడిచిన 24 గంటలుగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. ఆయనకి ఎక్మో, ఇతర లైఫ్ సపోర్ట్‌పై చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ పేర్కొంది. తమ నిపుణుల బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఎస్పీబీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్ సోకడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం మన అందరికి తెలిసిందే. మొదట జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు.. ఆగస్టు 13న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ రోజు నుంచీ ఆయనకు ఐ.సీ.యూ.లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆ తరవాత వెంటిలేటర్‌తో పాటు ఎక్మో (ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనేషన్) సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు కూడా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందుతున్నట్టు సమాచారం. నాన్న కోలుకుంటున్నారని, ఆహారం కూడా తీసుకుంటున్నారని ఈ మధ్యే ఎస్పీ చరణ్ వీడియో మెసేజ్ ద్వారా తెలిపారు. ఇంతలోనే మళ్లీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించడం చాలా బాధాకరం.
Tweets in twitter:-
Let’s pray for #SPB gaaru
Need all ur prayers at this hour 
#getwellsoonspbsir
Health Condition of #SPbalasubramanyam garu has deteriorated further and is extremely critical. MGM Hospital experts are closely monitoring his health #GetWellSoonSPBGaru #SPB
లేటెస్ట్ హెల్త్ అప్డేట్ వీడియో లు 24వ తేదీ వి చూడండి




No comments:
Post a Comment