ఎస్.పీ.బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి పై హెల్త్ బులెటిన్ అప్ డేట్
S.P Bala Subrahmanyam Helth Bulletein Updates
- వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని బులెటిన్ లో వెల్లడి
- ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదని వివరణ
- బాలు ఇంకా ఎక్మో సపోర్ట్ తీసుకుంటున్నారన్న ఎంజీఎం ఆసుపత్రి
కరోనా చికిత్స పొందుతున్న గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజా ఆరోగ్యపరిస్థితిపై చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఈ సాయంత్రం వేళలో ఒక బులెటిన్ వెలువరించింది. ఎస్పీ బాలు ఇంకా ఎక్మో సపోర్ట్ తో వెంటిలేటర్ పైనే ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పు లేదని, నిలకడగానే వుందని ఆ బులెటిన్ లో తెలిపారు.
![]() |
21st August 2020 5.30 P.M Health Bulletin of MGM Health Care |
బాలు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, విభిన్న వైద్య విభాగాల నిపుణులతో కూడిన తమ వైద్య బృందం అహర్నిశలు బాలు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆయన శరీరంలో కీలక అవయవాల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని బులెటిన్ లో వివరించారు. బాలు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
వీడియో యు . ఆర్ యల్. చూడండి